India: 12 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు ఫట్... న్యూజిలాండ్ ఆలౌట్!

నేపియర్ లో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 157 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. కుల్ దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి రాణించగా, ఆట ఆరంభంలో మహమ్మద్ షపీ ప్రధాన ఆటగాళ్లను దెబ్బతీసేలా 3 కీలక వికెట్లు తీశాడు. చాహాల్ కు 2, జాదవ్ కు 1 వికెట్ లభించింది. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ కుల్ దీప్ బౌలింగ్ లో శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన తరువాత న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎంతోసేపు నిలదొక్కుకోలేదు. 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. మరికాసేపట్లో 158 పరుగుల విజయలక్ష్యంతో భారత జట్టు మైదానంలోకి దిగనుంది.
India
Newzeland
Cricket

More Telugu News