కర్నూలు అసెంబ్లీ సీటు నాదే.. చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉంది!: ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

22-01-2019 Tue 13:55 | Andhra
  • సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయి
  • పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా ఉన్నాను
  • రాబోయే ఎన్నికల్లో టీడీపీదే విజయం
కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం ఇటు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్, అటు ఎస్వీ మోహన్ రెడ్డి నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో మరోసారి టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరొకరికి చంద్రబాబు టికెట్ ఇవ్వరని స్పష్టం చేశారు.

పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సర్వేల్లో తనకే ఎక్కువ అనుకూలత ఉన్నట్లు తేలిందని మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసన్నారు. కర్నూలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ తన ఆధ్వర్యంలోనే సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమనీ, సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, కర్నూలు స్థానంపై టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ గంపెడాశలు పెట్టుకున్నారు.
Andhra PradeshKurnool DistrictTelugudesamsv mohan reddyassembly seatChandrababutg venkatesh

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more