టీచర్ పోస్టులను ఫిబ్రవరిలోగా భర్తీ చేయండి.. ఏపీ, తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం!
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇద్దరు వ్యక్తులు
- ఆదేశాలు అమలుకావడం లేదంటూ పిటిషన్
- ఏపీలో డీఎస్సీ జరుగుతోందన్న న్యాయవాది
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. తెలంగాణలో నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంకా పోస్టింగులు మాత్రం ఇవ్వలేదని తెలిపారు. హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసుల కారణంగా కొన్ని పోస్టులకు ఇంకా ఫలితాలను ప్రకటించలేదన్నారు. ఈ సందర్భంగా ఏపీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయనీ, ఫిబ్రవరి చివరికల్లా నియామక ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.