టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసిన రాజాసింగ్
- డ్రగ్స్ కేసు విచారణ అర్థాంతరంగా ఎందుకు ఆగిపోయింది?
- ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకుని తిరుగుతున్నారు
- కంటి వెలుగు పథకం కింద ఎంతమందికి ఆపరేషన్ చేశారు?
ఉస్మానియా ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా ఉందని... కొత్త ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వ హామీ ఏమైందని రాజాసింగ్ ప్రశ్నించారు. ఉస్మానియాలో వైద్యులు హెల్మెట్లు పెట్టుకుని తిరిగే పరిస్థితి నెలకొందని అన్నారు. కొంత మంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారని... అలాంటి పార్టీకి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సరైన గుణపాఠం చెప్పారని పరోక్షంగా ఎంఐఎంపై విమర్శలు గుప్పించారు.