ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీకి కనీస వయసును 20 ఏళ్లకు తగ్గించాలి!: అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
- మహాత్మాగాంధీ కంటే అంబేడ్కర్ గొప్పవారు
- జాతీయ పార్టీల్లో యువత ఎదగలేరని వ్యాఖ్య
- యువ నాయకత్వ సదస్సులో మజ్లిస్ చీఫ్
రాజకీయాల్లో యువత గణనీయంగా పెరగాలని ఒవైసీ అభిప్రాయపడ్డారు. అయితే జాతీయ పార్టీల్లో చేరితే యువత ఉన్నత స్థానాలకు ఎదగలేదని వ్యాఖ్యానించారు. యువత ప్రాతినిధ్యం పెంచేందుకు ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులుగా పోటీచేసేందుకు కనీస వయసును 20 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. తనకు 49 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా తనను యువ నాయకుడిగానే గుర్తిస్తున్నారంటూ సభికుల్లో నవ్వులు పూయించారు.