భార్యపై అనుమానం.. సంక్రాంతి నాడు గొంతు నులిమి చంపేసిన భర్త
- మద్యానికి బానిసై భార్యకు తరచూ వేధింపులు
- పోలీసుల కౌన్సెలింగ్ తోనూ మారని ప్రవర్తన
- హత్య తరువాత ఇంట్లోని డబ్బులతో పరారీ
మద్యానికి పూర్తిగా బానిసైన రాము.. భార్యను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేని ఆమె రెండేళ్ల క్రితం సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా ఇటీవల భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. సంక్రాంతి పండుగ రోజున రాత్రి ఫుల్లుగా తాగొచ్చిన రాము భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న రూ. 15 వేలను పట్టుకుని పరారయ్యాడు.
ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉన్నా అలికిడి లేకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా శ్వేత మృతి చెంది కనిపించింది. ఆమె తండ్రి నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.