గత జన్మలో మనమ్మాయేనేమో... నాలుగు భారతీయ భాషలు మాట్లాడే ట్యునీషియా యువతిపై సుష్మా స్వరాజ్ ప్రశంసలు!
- 'భారత్ కో జానీయే' క్విజ్ ఫైనలిస్టుల్లో మహా గైడా
- మహా కళ్లల్లో భారతీయతత్వం కనిపిస్తోందన్న సుష్మా
- మలయాళం, తమిళం, హిందీ, ఉర్దూ మాట్లాడగల మహా
ప్రవాసీ భారతీయ కేంద్రంలో జరిగిన క్విజ్ పోటీలకు అతిథిగా వచ్చిన సుష్మ ప్రసంగిస్తూ, విదేశాంగ శాఖ నిర్వహించే అన్ని ఈవెంట్లలో ఈ క్విజ్ పోటీలు తనకెంతో ఇష్టమని అన్నారు. "మహా, నువ్వు గత జన్మలో ఇండియన్ అయ్యుంటావు. మేము గతజన్మ ఉందని నమ్ముతాం. నువ్వు మాట్లాడే భాషలో, నీ కళ్లలో భారతీయతత్వం, దేశంపై ప్రేమ కనిపిస్తోంది" అని అన్నారు. ఆపై మీడియాతో మాట్లాడిన మహా, తాను కథాకళి నేర్చుకున్నానని, బాలీవుడ్ సినిమాలు, దక్షిణాది సినిమాలంటే ఎంతో ఇష్టమని, షారూక్ ఖాన్, తమిళ నటుడు విజయ్ లకు తాను అభిమానినని వ్యాఖ్యానించారు. హిందీ నేర్చుకోవడానికి ఇంటర్నెట్ లో బాలీవుడ్ చిత్రాలను చూసేదాన్నని వ్యాఖ్యానించారు.