మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పోలీసుల భయంతో రాయితో తలపై మోది హత్య!
- తెలంగాణలోని సంగారెడ్డిలో ఘటన
- మహిళను దారుణంగా హత్యచేసిన వ్యక్తులు
- కేసు నమోదు చేసిన పోలీసులు
జిల్లాలోని ఝరసంగం ప్రాంతానికి చెందిన పుణ్యమ భర్త నుంచి 30 ఏళ్ల క్రితం విడిపోయింది. మతిస్థిమితం కోల్పోయి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో పుణ్యమపై కన్నేసిన కొందరు మృగాళ్లు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం విషయం పోలీసులకు పొక్కకుండా బలమైన వస్తువుతో తలపై మోది చంపారు.
ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. స్థానికులు అచేతనంగా రక్తపు మడుగులో పడిఉన్న పుణ్యమను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తలపై బలంగా కొట్టడంతోనే బాధితురాలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.