రైలు డోర్ వద్ద నీలం రంగు లైట్లు.. ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వే కొత్త పద్ధతి!
- ప్లాట్‌ఫాంలపై ప్రమాదాల నివారణపై రైల్వే ప్రత్యేక దృష్టి
- బోగీ ద్వారంపై నీలం రంగు లైట్ల ఏర్పాటు
- అవి వెలిగాయంటే రైలు కదులుతున్నట్టే
రైలు కదిలే సమయంలో లైటు కాంతి ప్లాట్‌ఫాంపై పడుతుందని, దానిని దాటి రావడం ప్రమాదమని చెప్పడమే వీటి ఉద్దేశమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్లాట్‌ఫాంలపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ముంబైలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ కావడంతో తొలుత అక్కడి లోకల్ రైళ్లలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. గతేడాది జనవరి-జూలై మధ్య కదులుతున్న రైళ్ల నుంచి కిందపడి 871 మంది గాయపడ్డారు.