అడిలైడ్ వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- సిడ్నీ వన్డేలో ఓడిన భారత్
- ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ గల్లంతు
- విజయం కోసం ఇరు జట్లు పోటాపోటీ
ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ మాట్లాడుతూ.. వికెట్ బాగుందని పేర్కొన్నాడు. మంచి స్కోరు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచుతామన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే సిరీస్ కోల్పోయినట్టే. అడిలైట్ వన్డేలో గెలవడం ద్వారా సిరీస్‌ను ఇక్కడే సొంతం చేసుకోవాలని ఫించ్ సేన భావిస్తోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ
ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, ఉస్మాన్ ఖావాజా, షాన్ మార్స్, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ స్టోయిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ లియాన్, పీటర్ సిడెల్, రిచర్డ్సన్, జాసన్ బెహ్రెండార్ఫ్