Train Track: కొల్హాపూర్ - హైదరాబాద్ రైల్లోని 1500 మందిని కాపాడిన ఇద్దరు యువకులు!

ఇద్దరు యువకులు చేసిన సాహసం కొల్హాపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులోని 1500 మంది ప్రాణాలు కాపాడింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇద్దరు యువకులు హుబ్బళ్ళి సమీపంలో బైక్ పై వెళుతుండగా, రైల్వే ట్రాక్ పై భారీ చెట్టు కుప్పకూలి ఉండటాన్ని గమనించారు.

అదే సమయంలో రైలు వస్తుండగా, గమనించిన ఇద్దరూ, రైలుకు ఎదురు పరిగెడుతూ దాన్ని ఆపేందుకు ప్రయత్నం చేశారు. పట్టాలపై పరిగెత్తుకుంటూ వస్తున్న ఇద్దరిని చూసిన లోకో పైలట్, వారు అలా ఎందుకు చేస్తున్నారోనని ఆలోచిస్తూనే రైలును ఆపాడు. అదే సమయంలో దూరంగా ట్రాక్ పై పడివున్న చెట్టు కనిపించింది. దీంతో వారిని అభినందిస్తూనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడా పైలట్.

సిబ్బంది వచ్చి, చెట్టును తొలగించిన తరువాత రైలు కదలగా, అప్పటివరకూ వివిధ స్టేషన్లలో ఆగివున్న రైళ్లు తరువాత కదిలాయి. ఇద్దరి సాహసంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు వారిని ప్రశంసించారు.
Train Track
Hubli
Hyderabad
Kolhapur
Youth

More Telugu News