నెదర్లాండ్స్ లో ఇలా ఎంజాయ్ చేస్తున్నామంటున్న సమంత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెదర్లాండ్స్ లో ఇలా ఎంజాయ్ చేస్తున్నామంటున్న సమంత!

  • 2019కి సిద్ధంగా ఉన్నా
  • గొప్ప అంచనాలతో కొత్త ఏడాదిలోకి అడుగులు
  • ఓ పోస్ట్ లో ఫొటోలు పోస్ట్ చేసిన సమంత
ప్రస్తుతం నెదర్లాండ్స్ లో నాగచైతన్య-సమంత జంట ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ ‘ది బెస్ట్’ అంటూ సమంత తన సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ లో దిగిన ఫొటోలను సమంత పోస్ట్ చేసింది. ‘గొప్ప అంచనాలతో 2019లోకి అడుగుపెడుతున్నాం’, ‘నువ్వు నవ్వే విధానం’, ‘2019కి సిద్ధంగా ఉన్నా’, ‘నాట్ ఎలోన్’ అనే క్యాప్షన్స్ తో కొన్ని ఫొటోలను సమంత పోస్ట్ చేసింది. చలి దుస్తులు ధరించిన నాగచైతన్య-సమంతలు నవ్వుకుంటూ నడిచి వెళుతుండటం, సమంత, ఆమెతో ఉన్న వ్యక్తులు కడుపుబ్బ నవ్వుకుంటున్న దృశ్యాలతో పాటు సమంత సింగిల్ గా పోజిచ్చిన చిత్రాలను ఆ పోస్ట్ లో పొందుపరిచింది. ఈ ఫొటోల్లో నాగచైతన్య, సమంతలు కొత్త లుక్ లో కనబడుతున్నారు.  
netherlands
samantha
naga chaitanya
Tollywood

More Telugu News