రేపు విద్యాబాలన్ తో కలిసి నిమ్మకూరుకు బాలకృష్ణ!

  • ప్రత్యేక విమానంలో గన్నవరంకు బాలయ్య
  • ఆపై రోడ్డు మార్గాన నిమ్మకూరుకు
  • రేపు నిమ్మకూరులో రెండో భాగం షూటింగ్
వెండితెరపై బసవతారకం పాత్రను పోషించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్ తో కలిసి, ఎన్టీఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరులో రేపు నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ మేరకు నిమ్మకూరులో ఏర్పాట్లు చేస్తున్నట్టు బాలకృష్ణ మిత్రుడు బుర్రా గాంధీ మీడియాకు తెలిపారు. బాలకృష్ణ, విద్యాబాలన్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా రానున్నారని చెప్పారు.

అక్కడ ముందుగా ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేశాక, 'ఎన్టీఆర్' రెండో భాగానికి సంబంధించిన ఓ సీన్ ను గ్రామంలో చిత్రీకరించనున్నారని చెప్పారు. హరికృష్ణగా నటిస్తున్న కల్యాణ్ రామ్ కూడా షూటింగ్ లో ఉంటారని చెప్పారు. రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకునే వీరు, ఆపై రోడ్డు మార్గంలో 10 గంటల సమయానికి నిమ్మకూరు చేరుకుంటారని వెల్లడించారు.
Go Back to Shorts
Balakrishna
Kalyaram
Vidyabalan
NTR
Nimmakuru

More Telugu News