జగన్ పై కేసుల విషయంలో చంద్రబాబు చెప్పిందే జరిగింది!
- హైకోర్టు విడిపోతే కేసు మొదటికి వస్తుంది
- విచారణను ఆలస్యం చేసేందుకు బీజేపీ కుట్ర
- ఇటీవలే వ్యాఖ్యానించిన చంద్రబాబు
న్యాయమూర్తుల పంపకంలో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసులను విచారిస్తున్న జస్టిస్ వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే న్యాయమూర్తి తిరిగి విచారణ చేపట్టక తప్పనిసరి పరిస్థితి. ఇక, జగన్ పై ఉన్న కేసులను అమరావతికి తరలించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసులు ఉమ్మడి రాష్ట్రంలో జరగడం, అటాచ్ అయిన జగన్ ఆస్తులు హైదరాబాద్ లోనే ఉండటం కారణంగా విచారణ నాంపల్లిలోని సీబీఐ కోర్టులోనే సాగాల్సివుందని చెబుతున్నారు.