ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ షాక్.. పార్టీ నేత హెచ్ఎస్ ఫూల్కా రాజీనామా
- ట్విట్టర్ ద్వారా తెలిపిన ఫూల్కా
- మరోసారి ఆలోచించమన్న కేజ్రీవాల్
- నేడు మీడియా సమావేశం
‘‘ఆమ్ ఆద్మీ పార్టీకి నేను రాజీనామా చేశాను. ఆ లేఖను కేజ్రీవాల్‌కు అందించాను. రాజీనామా విషయంలో నన్ను పునరాలోచించుకోవాలని అడిగారు. అయితే, ఇప్పటికే తాను ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు ఆయనకు వివరించా’’ అని ఫూల్కా ట్విట్టర్ ద్వారా తెలిపారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశం నిర్వహించి రాజీనామాకు గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని ఫూల్కా తెలిపారు.