మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులా...అయితే కొత్త ఆఫర్లు ఇవిగో!

02-01-2019 Wed 10:11 | Both States
  • కొత్త సంవత్సరం సందర్భంగా పలు ప్రయోజనాలు ప్రకటించిన సంస్థ
  • వెల్లడించిన తెలంగాణ సీజీఎం వి.సుందర్‌
  • అపరిమిత కాల్స్‌, ఉచిత కాలర్‌ టూన్స్‌ వంటి ఆకర్షణలు
తన వినియోగదారులను కాపాడుకోవడం, కొత్త వారిని ఆకర్షించడం లక్ష్యంగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) నూతన సంవత్సరం సందర్భంగా మొబైల్‌ వినియోగదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది. అపరమిత కాల్స్‌, డేటా, ఉచిత రింగ్‌టోన్స్‌ వంటి ప్రయోజనాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాలను తెలంగాణ టెలికాం సర్కిల్‌ సీజీఎం వి.సుందర్‌ వెల్లడించారు.

ఇందులో వర్షికా-1699 ప్లాన్‌ ఆకర్షణీయంగా ఉంది. ఈ ప్లాన్ లో రూ.1,699 చెల్లించి ఏడాదిపాటు అపరిమిత (లోకల్‌ అండ్‌ రోమింగ్‌) వాయిస్‌కాల్స్‌, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, ఉచిత కాలర్‌ట్యూన్‌, అపరిమిత డేటా పొందవచ్చు. అయితే డేటా వినియోగదారులు ఒకరోజులో 2జీబీ డేటా ఉపయోగించాక వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిస్తారు. ఇవే ఆఫర్లు వర్షికా ప్లస్‌-2099 ప్లాన్‌కూ వర్తిస్తాయి. రూ.2,099తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 4జీబీ వినియోగించాక డేటా వేగం 80 కేబీపీఎస్‌కు కుదిస్తారు. రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే 487 వైఫై హాట్‌స్పాట్‌లను నెలకొల్పింది. మరో 423 హాట్‌స్పాట్‌లను ఫిబ్రవరిలోగా ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా 100 మీటర్ల పరిధిలో 2 నుంచి 10 ఎంబీపీఎస్‌ వేగంతో రోజుకు 4జీబీ డేటా చొప్పున బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు పొందొచ్చు.

రూ.300 టాప్‌ అప్‌తో రూ.30, గురు, శుక్ర, శనివారాల్లో రూ.250, సోమ, మంగళ, బుధవారాల్లో రూ.500, రూ.600 టాప్‌అప్‌ చేయించుకుంటే పదిశాతం అదనంగా టాక్‌టైం లభిస్తుంది. కాంబో ఎస్టీవీ-175లో రూ.200, కాంబో ఎస్టీవీ-219లో రూ.250 టాక్‌టైంతో పాటు 0.5 జీబీ డేటా 60 రోజుల కాలపరిమితితో లభిస్తోంది. కాంబో ఎస్టీవీ-252లో రూ.350 టాక్‌ టైం, 2 జీబీ డేటా, కాంబో ఎస్టీవీ-402లో రూ.600 టాక్‌ టైం, 4జీబీ డేటా 60 రోజుల కాలపరిమితితో అందిస్తున్నారు.


BSNLNew offerstelangana circle CGM

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more