కొత్త సంవత్సరంలో ఎన్నికల గోదాలోకి... కీలక ప్రకటన చేసిన నటుడు ప్రకాశ్ రాజ్!

  • ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను
  • ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా
  • ట్విట్టర్ లో వెల్లడించిన ప్రకాశ్ రాజ్
నూతన సంవత్సర శుభవేళ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన వెలువరించారు. ఈ సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడనున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న వివరాలను త్వరలో తెలియజేస్తానని అన్నారు.

"అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి మద్దతుతో లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను" అని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, రజనీకాంత్, కమలహాసన్ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సినీ ప్రముఖుల్లో ప్రకాష్‌రాజ్ మూడో వ్యక్తి.
Go Back to Shorts
Prakash Raj
Elections
Twitter
New Year

More Telugu News