హిందీ ‘బిగ్ బాస్‘ సీజన్-12 విజేత దీపికా కక్కర్!
- నిన్న రాత్రి ముంబయిలో జరిగిన గ్రాండ్ ఫినాలే
- టాప్ 3 కంటెస్టెంట్లు దీపికా కక్కర్, శ్రీశాంత్, దీపక్
- విజేతకు రూ.30 లక్షల నగదు, ట్రోఫీని అందజేసిన సల్మాన్
ఇదిలా ఉంటే.. విజేతను ప్రకటించకముందు ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. విజేతను ప్రకటించకముందే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ షోను విడిచి వెళ్లిపోవాలని, అలా వెళ్లే వారికి రూ.20 లక్షలు ఇస్తామని సల్మాన్ ప్రకటించాడు. ఇందుకు, దీపికా కక్కర్, శ్రీశాంత్ లు ముందుకు రాలేదు కానీ, దీపక్ మాత్రం ముందుకొచ్చాడు. ఆ ఇరవై లక్షల రూపాయలు తీసుకుని దీపక్ షో నుంచి బయటకొచ్చేశాడు. ఈ షోకు మరో ప్రత్యేకత కూడా ఉంది. బిగ్ బాస్ చరిత్రలో విజేతను ప్రకటించకముందే ఏ కంటెస్టెంట్ కి ఇంత పెద్దమొత్తంలో ప్రైజ్ మనీ ఇవ్వలేదు.
ఇక, విజేత దీపికా కక్కర్ గురించి చెప్పాలంటే.. జెట్ ఎయిర్ వేస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా మూడేళ్లు పని చేసింది. అనారోగ్య కారణాల వల్ల ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన ఆమె, యాక్టింగ్ కెరీర్ పై దృష్టి పెట్టింది. హిందీ పాప్యులర్ సీరియల్ ‘ససురాల్ సిమర్ కా’ ద్వారా ఆమె ప్రజాదరణ పొందింది. పలు రియాల్టీ షోల్లోను పాల్గొంది. ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ ‘పల్టాన్’ ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసింది. తన సహనటుడు షోయబ్ ఇబ్రహీంతో ప్రేమలో పడ్డ దీపిక, గత ఏడాది అతన్ని పెళ్లాడింది. షోయబ్ ముస్లిం కావడంతో దీపిక కూడా ఆ మతంలోకి మారింది. ఈ క్రమంలో తన పేరును ‘ఫైజా’ గా మార్చుకుంది.