న్యూ ఇయర్ సందర్భంగా వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన జియో!

  • రూ.399 రీఛార్జ్ పై వందశాతం క్యాష్ బ్యాక్ 
  • కూపన్ ల రూపంలో లభించనున్న క్యాష్ బ్యాక్ 
  • 'ఏజియో' యాప్ లో లేదా వెబ్ సైట్లో రిడీమ్ చేసుకోవాలి
న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా రూ.399 రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు వందశాతం క్యాష్ బ్యాక్ పొందనున్నారు. ఈ క్యాష్ బ్యాక్ కూపన్ ల రూపంలో లభించనుంది. మూడు రోజుల క్రితం నుండే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్ వచ్చే నెల జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో భాగంగా లభించిన కూపన్ లని 'ఏజియో' యాప్ లో లేదా వెబ్ సైట్ లో రిడీమ్ చేసుకోవాలి. మార్చి 15 తేదీ వరకు మాత్రమే కూపన్ లని రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Go Back to Shorts
NewYear2019
jio
Reliance
Tech-News
offer

More Telugu News