శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

Six Killed in ORR Crash Near Shamshabad
  • ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
  • లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు
  • మృతుల్లో మహిళలు, చిన్నారులు
  • మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వద్ద టర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. టీఎస్ 23ఎఫ్ 2298 నెంబర్ కలిగిన మారుతి సుజుకీ వాగనార్ కారు పెద్దగోల్కొండ నుంచి శంషాబాద్ వెళుతోంది. 

వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. దీంతో లారీకి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఏడుగురు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సిరిసిల్లకు చెందిన వీరు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Advertisement
Six Killed in ORR Crash Near Shamshabad
ORR Accident

More Telugu News