వాణిజ్య సిలిండర్ ధరల పెంపు... ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
- అంతిమంగా సామాన్యుడిపై భారం పడుతుందని ఆందోళన
- హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులకు ఆర్థిక భారమన్న మంత్రి
- ఎన్నికల తర్వాత ధరల పెంపు మోసం చేయడమేనని వ్యాఖ్య
ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమంటే ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఈరోజు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.