నందమూరి సుహాసినికి ఇప్పుడు ఏం చేస్తారు?: చంద్రబాబుకి కేసీఆర్ ప్రశ్న

29-12-2018 Sat 18:10 | Telangana
  • హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూడా రాజకీయాలకు ఉపయోగించుకున్నారు
  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే మోదీకి లేఖ రాస్తా
  • చంద్రబాబుకు నీతి, జాతి లేదు
ఇతరులను వాడుకుని వదిలేయడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చివరకు హరికృష్ణ చావును కూడా చంద్రబాబు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూశారని చెప్పారు. హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూడా దారుణంగా రాజకీయాలకు ఉపయోగించుకున్నారని... అమాయకురాలిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపారని విమర్శించారు. ఇప్పుడు ఆమెకు ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు.

ఓ వైపు రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి చేస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని... మరోవైపు, మాకు ఆదాయం లేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ మాట్లాడతారని.... రెండింటిలో ఏది నమ్మాలని కేసీఆర్ ప్రశ్నించారు. తన మాటలతో అందరినీ చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విషపూరితమైన రాజకీయం ఎవరికీ మంచిది కాదని అన్నారు.

కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చంద్రబాబు చెబుతున్నారని... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ ఎంపీలు లోక్ సభ, రాజ్యసభల్లో చెప్పారని గుర్తు చేశారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పష్టంగా ఉందని... అవసరమైతే ఏపీకి హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. చంద్రబాబుకు నీతి, జాతి లేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్వయం ప్రకాశశక్తి లేని నాయకుడని అన్నారు. మామ పార్టీని లాక్కుని అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు.
KCRTRSChandrababuTelugudesam

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more