ఆంధ్రా మీద కేంద్రానికి ఎంత కక్ష ఉందో విశాఖ ఎయిర్ షో రద్దుతో అర్థమవుతోంది!: చంద్రబాబు
- హైకోర్టును సమయం ఇవ్వకుండా విభజించారు
- అమరావతికి వచ్చేందుకు విమానాలు లేవు
- కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన చంద్రబాబు
అమరావతికి వచ్చేందుకు ప్రస్తుతం కనీస విమాన సర్వీసులు లేవని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టచివరి నిమిషంలో ‘విశాఖ ఉత్సవ్’ ఎయిర్ షోను రద్దు చేశారంటే ఏపీపై కేంద్రం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. 2019 నాటికి పోలవరం ద్వారా పంటపొలాలకు నీళ్లు అందిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఉద్యాన పంటల్లో కరవు జిల్లా అయిన అనంతపురం అగ్రస్థానంలో నిలిచిందని చంద్రబాబు ప్రశంసించారు. రాయలసీమలో నీటిని సరిగ్గా వాడుకుంటే ఉద్యానవన పంటలకు హబ్ గా మారుతుందని జోస్యం చెప్పారు.