ప్రేమికురాలిని చంపుతానని బెదిరించిన యువకుడు.. పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
- ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక
- రోడ్డుపై అడ్డగించి చంపుతానని బెదిరింపు
- అరెస్ట్ చేసిన పోలీసులు
విషయం తెలిసిన ఖలీం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతడి ఆగడాలు మితిమీరడంతో పద్ధతి మార్చుకోవాలంటూ బాలిక కుటుంబ సభ్యులు ఖలీంను హెచ్చరించారు. అయినా, పద్ధతి మార్చుకోని ఖలీం ఈ నెల 22న దిల్సుఖ్నగర్లో బాలికను అడ్డగించాడు. తనతో మాట్లాడాలంటూ రోడ్డుపైనే ఆమెను దూషించాడు. తనను కాకుండా మరొకరిని పెళ్లాడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యుల సహకారంతో బాలిక పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖలీంను అరెస్ట్ చేశారు.