కేన్సర్ బాధిత చిన్నారులతో ఐశ్వర్యారాయ్ క్రిస్మస్ వేడుకలు.. ఫొటోలు వైరల్!

  • ముంబైలోని ఆసుపత్రిలో కార్యక్రమం
  • చిన్నారులతో ఆడిపాడిన ఐశ్వర్య
  • ఐష్ తో ఫొటోల కోసం పోటీపడ్డ చిన్నారులు
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన మంచి మనసును చాటుకుంది. ఈసారి క్రిస్మస్ వేడుకలను ఐశ్వర్య ముంబైలోని ఓ కేన్సర్ ఆసుపత్రిలో చిన్నారులతో కలిసి జరుపుకుంది. కేన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు బహుమతులను అందించిన ఐష్, వారితో కలిసి పాటలకు స్టెప్పులేసింది. ఈ సందర్భంగా చిన్నారులంతా ఐశ్వర్యారాయ్ తో కలిసి ఫొటోలు దిగారు. కాగా, ఐశ్వర్యారాయ్ చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
Go Back to Shorts
Bollywood
Aishwarya Rai
cancer
survivoue kids
xmas
party

More Telugu News