రైతులకు రుణమాఫీపై.. ఎం.ఎస్.స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు!
- దేశవ్యాప్తంగా ఈ ధోరణి పెరుగుతోంది
- రాజకీయం కోసం మాఫీ చేస్తున్నారు
- దీన్ని ప్రోత్సహించకూడదని వ్యాఖ్య
వ్యవసాయ సంక్షోభం ఆర్థికపరమైనదని స్వామినాథన్ తెలిపారు. వ్యవసాయ విధానంలో రుణమాఫీ భాగం కాకూడదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాలు, లబ్ధి కోసం నాయకులు రుణమాఫీని ప్రోత్సహించకూడదని అభిప్రాయపడ్డారు. రుణాలను చెల్లించలేని, తీవ్రంగా నష్టపోయిన రైతులను మాత్రమే రుణమాఫీ కింద ఆదుకోవాలని చెప్పారు.