లేడిస్ హాస్టల్ లో యువతులు స్నానం చేస్తుండగా వీడియో రికార్డింగ్.. మైనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
- హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఘటన
- పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
మాదాపూర్ లోని ఓ లేడిస్ హాస్టల్ పక్కనే బాలుడి కుటుంబం నివాసం ఉంటోంది. 8వ తరగతి చదువుతున్న నిందితుడు పక్కనే హాస్టల్ లో అమ్మాయిలు స్నానం చేస్తుంటే కిటికీ దగ్గర కూర్చుని ట్యాబ్ తో వీడియోలు తీసేవాడు. అయితే ఈ నెల 16న కిటికీ దగ్గర అలికిడి అయినట్లు గమనించిన యువతి పైకి చూడగా, ట్యాబ్ తో నిందితుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు బాలుడి ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అందులోని వీడియోలు చూసి విస్తుపోయారు. గత ఆరు నెలలుగా దాదాపు పలువురు యువతులకు సంబంధించిన 3,000 వీడియోలు, ఫొటోలను నిందితుడు తీసినట్లు గుర్తించిన అధికారులు, బాలుడిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను ఎవరికైనా పంపించాడా? తన వద్దే ఉంచుకున్నాడా? అనే విషయమై నిందితుడిని అధికారులు విచారిస్తున్నారు.