పెథాయ్ ఎఫెక్ట్.. కాకినాడ తీరంలో 28 మంది జాలర్ల గల్లంతు.. కుటుంబ సభ్యుల్లో టెన్షన్ టెన్షన్!

  • నాలుగు బోట్లలో వెళ్లిన మత్స్యకారులు
  • గాలింపు ప్రారంభించిన అధికారులు
  • తుపాను ప్రభావంతో 23 మంది దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ ను పెథాయ్ తుపాను తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు పలు జిల్లాల్లో పంటలు నేలకొరగగా, ఆక్వా రైతులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పెథాయ్ తుపాను తీరం దాటినప్పటికీ మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురవడంతో పాటు చల్లటి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పెథాయ్ తాకిడి నేపథ్యంలో 28 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. తుపాను రాకముందు నాలుగు పడవల్లో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు, అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

దుమ్ములపేట, పర్లాపేట, ఉప్పలంకకు చెందిన 28 మంది జాలర్ల జాడ ప్రస్తుతం తెలియరావడం లేదు. కాగా, గల్లంతయిన జాలర్ల కోసం అధికారులు రంగంలోకి దిగి గాలింపును ప్రారంభించారు. అంతకుముందు సముద్రంలో ఓఎన్జీసీ రిగ్ వద్ద చిక్కుకున్న ఏడుగురు జాలర్లను అధికారులు కాపాడగలిగారు. కాగా, తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంలో మత్స్యకారుల కుటుంబాలు టెన్షన్ తో గడుపుతున్నారు.  

petahi
storm
Andhra Pradesh
kakinada
East Godavari District
28

More Telugu News