1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో... కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కు యావజ్జీవ ఖైదు!
- తీర్పు వెలువరించిన పటియాలా హౌస్ కోర్టు
- లొంగిపోయేందుకు 31 వరకూ గడువు
- మరో రెండు కేసులు పెండింగ్ లోనే
ఈ కేసులో గతంలో యశ్ పాల్ సింగ్ కు మరణశిక్షను, నరేష్ షెరావత్ కు యావజ్జీవ శిక్షను కోర్టు విధించిన సంగతి తెలిసిందే. సజ్జన్ కుమార్ ప్రమేయమున్న మరో రెండు కేసుల్లో దర్యాప్తు ఇంకా పూర్తి కావాల్సివుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యోదంతం తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగగా, పలువురు సిక్కు వర్గం వారిని దారుణంగా హతమార్చారు.