మొదటి సంతకం రైతుల రుణమాఫీ ఫైల్ పైనే: అశోక్ గెహ్లాట్
- నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న గెహ్లాట్
- తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
- ఎన్నికల మేనిఫెస్టోను తు.చ తప్పకుండా అమలు చేస్తామని ప్రకటన
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం పది రోజుల వ్యవధిలోనే రైతుల రుణాలన్నీ రద్దుచేసి వారికి ఊరటకలిగిస్తామని తెలిపారు. ఇందుకోసం తొలి మంత్రివర్గ సమావేశంలోనే అవసరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ తు.చ తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు.