హాకీ ప్రపంచకప్ విజేతగా బెల్జియం.. విజయం అందిన వెంటనే ఆటగాళ్ల ఉద్వేగం
- తొలిసారి ప్రపంచకప్ అందుకున్న బెల్జియం
- పెనాల్టీ షూటవుట్‌లో తేలిన ఫలితం
- ఆరో స్థానంతో సరిపెట్టుకున్న భారత్
ఆట పూర్తి సమయం గడిచినా ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటవుట్ అనివార్యమైంది. తొలుత బెల్జియం ఓ గోల్ చేయగా, నెదర్లాండ్స్ కూడా గోల్ చేయడంతో 1-1తో రెండు జట్లు సమానమయ్యాయి. రెండో పెనాల్టీలో ఇరు జట్లు విఫలమయ్యాయి. అయితే, మూడు, నాలుగు కిక్‌లను గోల్స్‌గా మలచిన బెల్జియం విజేతగా నిలిచింది. ఫలితంగా పరుషుల హాకీ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆరో జట్టుగా బెల్జియం రికార్డులకెక్కింది. ఈ టోర్నీలో భారత్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.