2019లో కేసీఆర్ పట్టిందల్లా బంగారమే.. ప్రయత్నిస్తే ప్రధాని కూడా కావొచ్చు!: జోతిష్యుడు రమణారావు
- మోదీకి నెగటివ్ వైబ్రేషన్స్ ప్రభావం
- పూజలు చేస్తే కేసీఆర్ కు ప్రధాని యోగం
- 2019లో రాహుల్ ఆశలు గల్లంతే
కేసీఆర్ జాతకం చాలా బలంగా ఉందనీ, కొన్ని పూజలు చేస్తే ఆయన ప్రధాని అయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఒకవేళ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేస్తే మోదీనే ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రధాని యోగం ఉన్నప్పటికీ, 2019లో మాత్రం అది జరగదని తేల్చిచెప్పారు.