ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు సాధించిన విజయం.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : సీఎం కేసీఆర్
- సకల జనులు నిండుగా దీవించి ఇచ్చిన విజయమిది
- నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు
- ప్రజల తీర్పు మేరకు కర్తవ్య నిష్ఠతో పని చేయాలి
గెలుపుతో అహంకారం రావొద్దని, ప్రజల తీర్పు మేరకు కర్తవ్య నిష్ఠతో పని చేయాలని సూచించారు. విజయం ఎంత ఘనంగా ఉందో, బాధ్యత కూడా అంత బరువుగా ఉందని అన్నారు. సమయం వృథా కాకుండా కష్టించి పనిచేయాలని, ప్రజల ఆకాంక్ష మేరకు కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతామని అన్నారు.