తెలంగాణలో ఓడిన అసలైన ప్రముఖులు వీరే!.. వెటకారంగా స్పందించిన విజయసాయిరెడ్డి!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వర్దన్నపేట, కంటోన్మెంట్ సహా పలు స్థానాల్లో ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రజాకూటమి నేతలపై విమర్శల దాడిని పెంచారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన వారు వీరేనంటూ ఓ జాబితాను ప్రకటించారు. విజయసాయిరెడ్డి ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..

‘తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా ఇదే,
1) చంద్రబాబు నాయుడు
2) బాలకృష్ణ
3) లగడపాటి రాజగోపాల్
4) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
5) ఈనాడు-ఈటీవి రామోజీ
6) మునుగుతున్న చంద్రబాబు తోకపట్టుకుని ఈదటానికి ప్రయత్నించిన కాంగ్రెస్’ ... అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Telangana Assembly Results
Mahakutami
TRS
Vijay Sai Reddy
YSRCP

More Telugu News