'జన నాయగన్' లీక్‌పై రజనీకాంత్ ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

Rajinikanth Reacts to Jana Nayagan Movie Leak Demands Action
షార్ట్స్‌లో చూడండి
విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం ఇంటర్నెట్‌లో లీక్ కావడంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను షాక్‌కు, తీవ్ర వేదనకు గురిచేసిందని అన్నారు. "చిత్ర పరిశ్రమ సంఘాలు దీనిపై గళం విప్పాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ నేరానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చూడాలి" అని రజనీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

మరోవైపు, 'జన నాయగన్' చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పైరసీపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, క్లిప్పులు, కొన్ని సందర్భాల్లో దాదాపు సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో అక్రమంగా సర్క్యులేట్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇది తీవ్రమైన డిజిటల్ పైరసీ నేరమని పేర్కొంది.

"వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వెబ్‌సైట్లు లేదా మరే ఇతర మాధ్యమం ద్వారా అయినా లీకైన కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం, చూడటం, షేర్ చేయడం, సర్క్యులేట్ చేయడం నేరం. ఇది కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుంది" అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎవరైనా పట్టుబడితే వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేవీఎన్ ప్రొడక్షన్స్ తమ ప్రకటనలో హెచ్చరించింది.

"లీకైన కంటెంట్ విషయంలో ప్రజలకు మేము ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై, ఎలాంటి మినహాయింపు లేకుండా, కఠినమైన సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దీని ద్వారా స్పష్టం చేస్తున్నాం. ఇలాంటి లీకైన కంటెంట్‌తో ఏ విధంగానూ సంబంధం పెట్టుకోవద్దని ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఈ వ్యవహారంలో ఎవరైనా పట్టుబడితే, తదనంతర పరిణామాలకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఒకవేళ మీకు అలాంటి కంటెంట్ ఏ రూపంలోనైనా అందితే, దయచేసి దాన్ని ఓపెన్ చేయవద్దు, మీ ఫోన్‌లో లేదా ఇతర పరికరాల్లో స్టోర్ చేయవద్దు, మరెవ్వరికీ ఫార్వార్డ్ చేయవద్దు. దాన్ని చూసిన వెంటనే డిలీట్ చేయాలని మేము గట్టిగా సూచిస్తున్నాం. మా ఈ హెచ్చరికను అతిక్రమించి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని కోరుతున్నాం" అంటూ కేవీఎన్ ప్రొడక్షన్స్ హెచ్చరించింది.
Go Back to Shorts
Rajinikanth
Jana Nayagan
Vijay
KVN Productions
Movie Leak
Piracy
Copyright
Digital Piracy
Telugu Cinema
Cyber Crime

More Telugu News