Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచ రికార్డు సృష్టించిన ‘అవెంజర్స్ 4’ ట్రైలర్

  • 24 గంటల్లోనే 289 మిలియన్ వ్యూస్
  • అవెంజర్స్ సిరీస్‌లో ఇదే చివరి సినిమా
  • వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల
మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిస్తున్న హాలీవుడ్ థ్రిల్లర్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ (ఎవెంజర్స్ 4) సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టించింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 289 మిలియన్ వ్యూస్‌‌తో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మార్వెల్ స్టూడియో కృతజ్ఞతలు తెలిపింది. అవెంజర్స్ ఫిల్మ్ సిరీస్‌లో ఇదే చివరి సినిమా అని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 26న సినిమా విడుదల కానుంది. ఆంథోనీ రుస్సో, జాయ్ రుస్సోలు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

‘అవెంజర్స్ 4’ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సూపర్ హీరోస్ రాక కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ట్రైలర్ రాగానే ఒక్కసారిగా దానిపై పడ్డారు. 24 గంటలు కూడా గడవకముందే ఏకంగా 2.89 కోట్లమంది చూసేశారు. యాక్షన్ సన్నివేశాలతో అత్యద్భుతంగా ఉన్న ట్రైలర్ సూపర్ హీరోస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయింది.
Avengers End Game
trailer
Marvel Studios
Hollywood

More Telugu News