'పడిపడి లేచె మనసు' నుంచి ఆకట్టుకుంటోన్న సాంగ్

06-12-2018 Thu 17:02 | Entertainment
  • హను రాఘవపూడి నుంచి లవ్ స్టోరీ 
  • యూత్ కి కనెక్ట్ అయ్యే సంగీత సాహిత్యాలు 
  • ఈ నెల 21వ తేదీన విడుదల  
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' సినిమా రూపొందింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"నువు నడిచే ఈ నేలపైనే .. నడిచానా ఇన్నాళ్లుగానే .. ఈ క్షణమే ఆపాలనున్నది భూభ్రమణమే. ఈ చెలిమి వద్దంటూ గతమే .. బందీగా చేసింది నన్నే .. తక్షణమే చేయాలనున్నది తనతో యుద్ధమే" అంటూ ఈ పాట కొనసాగుతోంది. సంగీత సాహిత్యాలు బాగున్నాయి. శర్వానంద్ .. సాయిపల్లవిపై సాగే ఈ పాట యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని అనిపిస్తోంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' హిట్ తరువాత సాయిపల్లవి .. 'మహానుభావుడు' హిట్ తరువాత శర్వానంద్ చేసిన సినిమా ఇది. అందువలన సహజంగానే మంచి అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి.
sharwanandsaipallavi

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more