రాజకీయ నాయకులా మజాకా.. మాదాపూర్లో పది రూపాయలకే ఫుల్ బాటిల్!
- సిటీ వైన్స్లో రాజకీయ మందు దందా
- రూ.10 కే ఖరీదైన మద్యం
- పోలీసుల అదుపులో మద్యం షాపు యజమాని ప్రవీణ్ గౌడ్
మద్యం పంపిణీ చేస్తున్నట్టు ఎవరికీ అనుమానం రాకుండా ఈ ఏర్పాట్లు చేశారన్నమాట. మాదాపూర్లోని సిటీ వైన్స్లో జరుగుతున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగుచూసి సంచలనమైంది. అయితే, ఇక్కడో మెలిక కూడా ఉంది. పది రూపాయలకే బాటిల్ లభిస్తోంది కదా.. అని ఎవరు పడితే వారు వెళ్తే ఇవ్వరు. మందుబాబులు ఇచ్చే నోటుకు ఉన్న సిరీస్ నంబరు సరిపోలాలి. అప్పుడే ఈడు మనోడని బాటిల్ ఇస్తారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో దాడిచేసిన పోలీసులు సిటీ వైన్స్ మేనేజర్ ప్రవీణ్గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు.