తెలంగాణను ముంచేసి మిగులు బడ్జెట్ సాధించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి

  • ఏపీలో దారుణమైన పాలన సాగుతోంది
  • టీడీపీ నేతలు బందిపోటుల్లాగా తయారయ్యారు
  • ఒక్క పెద్ద ప్రాజెక్టును చేపట్టలేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు బడ్జెట్ సాధించినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శించారు. కానీ బాబు హయాంలోనే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు బందిపోట్ల లాగా వ్యవహరించడంతో ఏపీ అప్పులు ఏకంగా రూ.2,50,000 కోట్లకు చేరుకున్నాయని దుయ్యబట్టారు.

ఏపీలో బాబు ప్రభుత్వం ఒక్క కాలువ తవ్వలేదనీ, ఒక్క పెద్ద ప్రాజెక్టును చేపట్టలేదని వ్యాఖ్యానించారు. అయినా వేర్వేరు రూపాల్లో రూ.లక్ష కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తికాకపోయినా నగదును మాత్రం ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ లో సాయిరెడ్డి స్పందించారు.
Go Back to Shorts
Telangana
Andhra Pradesh
budget
Chandrababu
Vijay Sai Reddy
YSRCP

More Telugu News