ఏపీ సర్కార్కు హైకోర్టు అక్షింతలు...జగన్పై దాడి కేసు కేంద్రానికి రిఫర్ చేయక పోవడంపై ఆగ్రహం
- సెక్షన్ 3 వర్తించదన్న అడ్వకేట్ జనరల్ వాదనతో ఏకీభవించని ధర్మాసనం
- కేసును ఎన్ఐఏకు ఇవ్వాలా, వద్దా అన్నది నిర్ణయించి చెప్పాలని కేంద్రానికి ఆదేశం
- తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా
జగన్పై దాడి కేసును బుధవారం మరోసారి విచారించిన ధర్మాసనం ముందు ఏపీ సర్కారు తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఈ కేసుకు సెక్షన్ 3 వర్తించదని, వ్యక్తిగత దాడిగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపడుతుందన్న అడ్వకేట్ జనరల్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించ లేదు. ఈ కేసును ఎన్ఐఏకు ఇవ్వాలా, వద్దా? అన్న విషయంపై ఈనెల 14వ తేదీలోగా నిర్ణయించి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.