బాబు కుట్రలు బద్దలు కానున్నాయి...తెలంగాణలో ఊహించని ఫలితాలు : ఎంపీ వినోద్‌

  • సర్వేతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్న ఏపీ ముఖ్యమంత్రి...విషం చిమ్ముతున్న లగడపాటి
  • చంద్రబాబు, రాజగోపాల్‌లు జోడెద్దుల వంటి వారు
  • తెలంగాణ అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతున్న బాబు
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుట్రలు త్వరలోనే బద్దలు కాబోతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు రానున్నాయని ఎంపీ వినోద్‌కుమార్‌ జోస్యం చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు.

 ప్రజల మద్దతు అధికార పార్టీకి ఉందన్న ఉద్దేశంతో లగడపాటి సర్వేల పేరుతో విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్‌లు జోడెద్దుల వంటి వారని, వారి కుట్రలను ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ వందకు పైగా స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకుంటారని ఆరోపించారు. మహాకూటమిలో నాలుగు పార్టీలు ఉన్నా టీజేఎస్‌, సీపీఐలను కాంగ్రెస్‌ చంపేసిందని, టీడీపీతోనే నడుస్తోందని విమర్శించారు.

mahakutami
Chandrababu
lagatapati survey
MP vinod

More Telugu News