ప్రేమించి పెళ్లాడాడు.. నమ్మి వెంట వస్తే వ్యభిచార కూపంలోకి దింపాడు!

05-12-2018 Wed 08:42 | Andhra
  • ఢిల్లీ యువతిని నమ్మించి మోసం
  • విటుల్లా వెళ్లి ఆట కట్టించిన పోలీసులు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు నమ్మి వెంట వచ్చిన యువతిని వ్యభిచారంలోకి దింపిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. విటుల వేషంలో వెళ్లిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఉడా కాలనీలో ఆటో డ్రైవర్ బి.చక్రధర్ వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఢిల్లీకి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో నాటకం ఆడిన చక్రధర్ ఆమెను తన వలలో పడేసుకున్నాడు.

ఓరోజు ఆమెను విజయనగరం తీసుకొచ్చి మరో ఇద్దరు మహిళలు ఉన్న ఇంట్లో పెట్టాడు. ఆ ఇద్దరు తన బంధువులని ఆమెను నమ్మించాడు. కొన్నాళ్లకు మరో అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ యువతిని శారీరకంగా లొంగదీసుకున్న నిందితుడు, పెళ్లి చేసుకుంటానని, కాకపోతే తాను చెప్పినట్టు చేసి డబ్బులు సంపాదించాలని వేధించడం మొదలుపెట్టాడు.

చక్రధర్ బారి నుంచి తప్పించుకునే మార్గం లేక అతడు పెట్టే బాధలు భరించిన యువతి ఈ నెల 3న ఎలాగోలా తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోవడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మారువేషంలో విటుల్లా వెళ్లి నిందితుడు చక్రధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
vizianagaramS*x RacketNew DelhiGirlCrime News

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more