రేపు కాకినాడలో‘వంచనపై గర్జన’ బహిరంగ సభ.. పాల్గొననున్న వైఎస్ జగన్!
- ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం సభ
- కేంద్రం, ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్న వైసీపీ అధినేత
- ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ నేతలు
‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో రేపు ఉదయం 9 గంటలకు కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్ లో సభను నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ సభకు హాజరై ప్రసంగించనున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.