రూ.3,999 లకే 19 అంగుళాల ఎల్‌సీడీ టీవీ!

  • మార్కెట్లో విడుదలైన డీటెల్ డీ1
  • యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్ట్‌ల సపోర్ట్ 
  • డీటెల్ అధికారిక వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ సంప్రదించాలి
డీటెల్ సంస్థ రూ.3,999 లకే నూతన డీటెల్ డీ1 ఎల్‌సీడీ టీవీని తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. 19 అంగుళాలు గల ఈ టీవీని కంప్యూటర్ మానిటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ధర మొదట్లో రూ.4,999 ఉన్నప్పటికీ, ఇప్పుడు రూ.3,999 ధరకే నిర్ణయించారు. దీనిలో యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఈ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు డీటెల్ అధికారిక వెబ్ సైట్ గాని, మొబైల్ యాప్ గాని సంప్రదించాలి. అలాగే, డిస్ట్రిబ్యూటర్లు, పార్ట్‌నర్లు B2BAdda.com అనే వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు.
Go Back to Shorts
Detel D1 TV
tv
Tech-News
India

More Telugu News