సోమాజీగూడలో అర్ధరాత్రి గోడను ఢీకొట్టిన కారు.. డ్రైవర్ సహా నలుగురు యువతులకు గాయాలు!

  • శంషాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం
  • డ్రైవర్ నిద్రమత్తే కారణం
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
హైదరాబాద్‌లోని సోమాజీగూడలో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కారు సోమాజీగూడ వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. కారులో ఎయిర్‌హోస్టెస్ సహా నలుగురు యువతులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో డ్రైవర్ సహా వారందరూ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
shamshabad
Somajiguda
Airport
Road Accident

More Telugu News