వినాయక్ నే కాదు .. బోయపాటిని కూడా రంగంలోకి దింపుతోన్న బాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వినాయక్ నే కాదు .. బోయపాటిని కూడా రంగంలోకి దింపుతోన్న బాలకృష్ణ

  • 'ఎన్టీఆర్' బయోపిక్ తో బిజీగా బాలకృష్ణ 
  • తదుపరి సినిమా వినాయక్ తో 
  • నిర్మాతగా సి.కల్యాణ్        
ప్రస్తుతం బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగుతో బిజీగా వున్నారు. మొదటి భాగంగా రానున్న 'కథానాయకుడు'కి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పూర్తి కానుంది. మార్చి నుంచి వినాయక్ తో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయని అంటున్నారు.

వినాయక్ తో పాటే బోయపాటిని కూడా బాలకృష్ణ రంగంలోకి దింపుతున్నారనేది తాజా సమాచారం. ఈ రెండు సినిమాల షూటింగు సమాంతరంగా జరిగేలా ప్లాన్ చేయమని బాలకృష్ణ చెప్పారట. ఆల్రెడీ బోయపాటి .. బాలకృష్ణతో ఒక కథ ఓకే చేయించుకుని ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయడంలో బాలకృష్ణ యువ హీరోలతో పోటీ పడుతుండటం విశేషం.         
balakrishna

More Telugu News