కిరాయి హంతకులతో తన మర్డర్ కు కుట్ర పన్నినట్లు జగన్ ఆరోపించడం సిగ్గుచేటు!: సోమిరెడ్డి
- నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైసీపీ విఫలమయింది
- ఏపీ ప్రజలు చంద్రబాబు వైపే ఉన్నారు
- తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పర్యటించిన మంత్రి
రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ ఘోరంగా విఫలమయిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కిరాయి హంతకులతో తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్లు వైసీపీ అధినేత జగన్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఏడాదిపాటు ప్రజల్లో తిరిగినా ఎలాంటి ఆదరణ లేకపోవడంతో జగన్ కోడికత్తి డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. వైసీపీ, బీజేపీ ఎన్నికుట్రలు చేసినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబుకే మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ బీజేపీయేతర ఫ్రంట్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు.