ఇసుక మాఫియా చేసే ప్రతి ఎమ్మెల్యే టపాకాయల్లా పేలిపోతారు: పవన్
- జగన్‌లా నేను పారిపోను
- పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు
- అవినీతి అధికారులను వదిలిపెట్టేది లేదు
జగన్, చంద్రబాబు ఇద్దరికీ అవినీతిరహిత పాలన అందించటం రాదని.. వారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేరని పవన్ విమర్శించారు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వచ్చానని పవన్ తెలిపారు.