'2.ఓ' కోసం 6,800 థియేటర్లు సిద్ధం... బాహుబలి రికార్డు బద్దలు!

  • 29వ తేదీన విడుదల కానున్న '2.ఓ'
  • విదేశాల్లో 4 వేల థియేటర్లలో రిలీజ్
  • 4డీ సౌండ్ సిస్టమ్ తో రానున్న చిత్రం
మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న హై బడ్జెట్ ఫిల్మ్ '2.ఓ' విడుదలకు ముందే 'బాహుబలి' రికార్డును అధిగమించింది. 'బాహుబలి' రెండో భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా 6,500 థియేటర్లలో విడుదల చేయగా, '2.ఓ' 6,800 థియేటర్లలో విడుదల కానుంది. 3డీ టెక్నాలజీ, 4డీ సౌండ్ తో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త విందు అందించడం ఖాయమని నిర్మాతలు చెబుతున్నారు.

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తయారైన సినిమా విదేశాల్లో 4 వేల థియేటర్లలో విడుదల కానుందని, ఇండియాలో 2,800 థియేటర్లలో విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు నటించగా, శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
2.0
Rajanikant
Shankar
Akshay Kumar
Theaters

More Telugu News