9 మంది చిన్నారులపై అత్యాచారం, హత్యచేసిన మానవమృగం పట్టివేత

  • చిన్నారుల కాళ్లు, తలను ఛిద్రం చేశాక అత్యాచారం
  • అతడు చెప్పిన విషయాలు విని షాక్‌కు గురైన పోలీసులు
  • ఎట్టకేలకు సంకెళ్లు
అభంశుభం తెలియని బాలికలపై అత్యాచారానికి పాల్పడి ఆపై అత్యంత దారుణంగా హతమార్చే కిరాతకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో చెలరేగిపోయిన ఈ మానవమృగానికి పోలీసులు సంకెళ్లు వేశారు. దీంతో రెండేళ్లుగా సాగుతున్న అతడి అకృత్యాలకు తెరపడింది. ఈ నెల 12న గురుగ్రామ్‌లోని ఓ మురికివాడలో మూడేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికపై అత్యాచారం చేసిన అనంతరం కాలు, తలను రాయితో ఛిద్రం చేసి హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా గంజ్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్‌కు గురయ్యారు.

మొత్తం 9 మంది చిన్నారులపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు వెల్లడించాడు. పనీపాటా లేని సునీల్ ఒంటరిగా కనిపించే బాలికలకు తినుబండారాల ఆశ చూపించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. ఆపై వారి కాళ్లు, తలను ఛిద్రం చేసేవాడు.  వారు బాధతో విలవిల్లాడుతుంటే అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ నెల 11న మూడేళ్ల బాలికను తీసుకెళ్తుండగా ఓ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
New Delhi
Gurgaon
Police
Crime News
Girls

More Telugu News